
జ్వరంతో యువకుడు మృతి
కూసుమంచి: మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన పందిరి అప్పిరెడ్డి(24) వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ మృతి చెందాడు. ప్రొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేసే ఆయన నాలుగు రోజులుగా జ్వరం బాధపడుతుండగామంగళవారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు.
చోరీ కేసులో మహిళ అరెస్ట్
తిరుమలాయపాలెం: బంగారం, వెండి నగల చోరీ కేసులో పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. తిరుమలాయపాలెంకు చెందిన పగిళ్ల రామకృష్ణ ఇంట్లో మే 23వ తేదీన దొంగతనం జరిగింది. రూ.లక్ష విలువైన బంగారం, వెండి వస్తువులు అపహరించగా దర్యాప్తులో డోర్నకల్ మండలానికి చెందిన సాయికల్యాణిని నిందితురాలిగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని సొత్తు రికవరీ చేయడంతో పాటు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఏడాది తర్వాత చోరీ సొత్తు రికవరీ
వైరారూరల్: రిటైర్డు ఉద్యోగి ఇంట్లో టీవీని యువకులు చోరీ చేయగా.. వారి మధ్య విబేధాలతో ఏడాది తర్వాత వ్యవహారం బయటకొచ్చిన ఘటన ఇది. వైరా మండలం పూసలపాడుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి చెరుకుపల్లి ప్రసాద్ ఇంట్లో రూ.80వేల విలువైన ఎల్‌ఈడీ టీవీని కొందరు యువకులు గత ఏడాది ఆగస్టులో చోరీచేశారు. దీనిపై ప్రసాద్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఇటీవల నిందితుల మధ్య వివాదం తలెత్తడంతో చోరీ విషయాన్ని ప్రసాద్‌కు తెలిపారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ పి.రామారావు, ట్రెయినీ ఎస్‌ఐ పవన్ టీవీని స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టారు.
స్పెషల్ డ్రైవ్‌లో 51 వాహనాలు సీజ్
తల్లాడ: తల్లాడలో బుధవారం పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 51 వాహనాలను సీజ్ చేశారు. ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ ఆధ్వర్యాన తనిఖీ చేయగా, నంబర్ ప్లేట్ లేకపోవడంతో పాటు సరైన పత్రాలు లేని మోటార్ సైకిళ్లను సీజ్ చేసి యజమానులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, బీమా, రిజిస్ట్రేషన్ కలిగి ఉండడమే కాక నంబర్ ప్లేట్ అమర్చుకోవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని తెలిపారు. తనిఖీల్లో ట్రెయినీ ఎస్‌ఐ వెంకటేశ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ మోటార్ల దొంగలు అరెస్ట్
కూసుమంచి: విద్యుత్ మోటార్లు, కాపర్‌వైర్ చోరీకి పాల్పడిన ముగ్గురిని కూసుమంచి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి ఏడు మోటార్లు, కాపర్ వైరు, మూడు ద్విచక్ర వాహనాలు, టైర్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు. కూసుమంచి శివాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మూడు బైక్‌లపై బస్తాలతో వెళ్తున్న వారు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పట్టుకుని విచారించగా కూసుమంచి మండలం వెంకట్రాంపురానికి చెందిన పుట్ట నరేష్, యాట రాజు, నిమ్మల రమేష్‌గా గుర్తించడంతో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈశ్వరమాధారం, పాలేరులో చోరీలకు పాల్పడిన ముగ్గురిని రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.
నిందితుల మధ్య విబేధాలతో వెలుగులోకి వ్యవహారం