
ఆశ కార్యకర్తలతో ఇంటింటి సర్వే
ఖమ్మంవైద్యవిభాగం: రక్తపోటు, మధుమేహం బాధితుల చికిత్సపై ఆరా తీసేందుకు ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వేచేయాలని డీఎంహెచ్‌ఓకళావతిబాయి సూ చించారు. ఎంపిక చేసిన ఆశా కార్యకర్తలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంట్రల్ బృందం మూ డు రోజులపాటు శిక్షణఇచ్చింది. ఈ బృందంలో డాక్టర్ డీ.ఆర్.స్వాతి, డాక్టర్ రోహిత్ గగ్రా ఉండగా డీఎంహెచ్‌ఓ బుధవారం వారితో సమావేశమై మాట్లాడారు. శిక్షణలో భాగంగా గురువారం నుండి ఒక్కో ఆశ కార్యకర్త, శిక్షణ పొందిన ఐసీఎంఆర్ సర్వేయర్లు సర్వే నిర్వహించాలని తెలిపారు. ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బాధితుల ఇళ్లకు వెళ్లి చికిత్స, వ్యాధి తీవ్రతపై ఆరా తీస్తూ సూచనలు చేయాలని చెప్పారు. ప్రోగ్రాం ఆఫీసర్ రామారావు, ఉద్యోగులు సుబ్రహ్మణ్యం, మురళి, నాగరాజు, చారి, మాలతి పాల్గొన్నారు.
వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి
తల్లాడ: గర్భిణులు, శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి వేయించేలా వైద్య, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షించాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. తల్లాడ పీహెచ్‌సీలో బుధవారం వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన ఆమె గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు ఎక్కువగా నమోదవుతున్నందున గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే, బిడ్డ పుట్టగానే ముర్రుపారు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. కాగా, ఈనెల 11న నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, వైద్యాధికారి ప్రత్యూషతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.