
‘బీసీ రిజర్వేషన్ల పేరిట రాజకీయాలు’
ఖమ్మం మామిళ్లగూడెం: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పేరిట మత రాజకీయాలకు దారితీసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు విమర్శించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. అక్కడ జరిగిన ధర్నా బీసీల హక్కుల కోసం కాకుండా, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నమేననని తెలిపారు. బీసీల హక్కులే కాంగ్రెస్ లక్ష్యమైతే ఇప్పటి వరకు ఒక్క బీసీ నేతను ముఖ్యమంత్రిగా ఎందు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమని చెప్పారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యాన బీసీల సంక్షేమానికి అనేక పథకాలు అమలవుతున్నాయని కోటేశ్వరరావు తెలిపారు. నాయకులు ఈ.వీ.రమేష్, నల్లగట్టు ప్రవీణ్‌కుమార్, ఆల్లిక అంజయ్య, కుమిలి శ్రీనివాసరావు, పమ్మి అనిత, తడుపునూరి రవీందర్, రుద్రగాని మాధవ్, జ్యోతుల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.