
ఢిల్లీ దీక్షలో జిల్లా కాంగ్రెస్ నేతలు
ఖమ్మంమయూరిసెంటర్/వైరా: బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్‌నాయక్, కోరం కనకయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొనగా కేంద్రం తీరును వారు ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, నాయకులు వనం ప్రదీప్త చక్రవర్తి, గజ్జల వెంకన్న, జెర్రిపోతుల అంజనీకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ సీఎంఓగా ప్రవీణ్‌కుమార్
ఖమ్మం సహకారనగర్: విద్యాశాఖలో కమ్యూనిటీ మొబిలైజేషన్ అండ్ మీడియా ఆఫీసర్(సీఎంఓ)గా వి.ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు ఇన్‌చార్జ్ డీఈఓ నాగపద్మజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చింతకాని మండలం పొద్దుటూరు హైస్కూల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్‌కుమార్ ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.