
బీసీ బిల్లుపై పలువురి రాజకీయాలు
ఖమ్మంమయూరిసెంటర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించా రు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిల్లుకు ఆమోదంపై కేంద్రప్రభుత్వం దొంగాట ఆడుతోందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రప్రభుత్వ నిధులు ఆగినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ బూర్జవా పార్టీలతో పొత్తు పెట్టుకోదని.. వామపక్ష పార్టీలు బూర్జువా పార్టీలతో అవగాహన, ఒప్పందాలు లేకుండా కలిసొస్తే ఐక్యంగా పోటీ చేస్తామన్నారు. కాగా, గాజాపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈనెల 7న ఖమ్మంలో నిర్వహించే ర్యాలీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని రంగారావు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఆవుల అశోక్, సీవై.పుల్లయ్య, ఆర్.శివలింగం, జి.రామయ్య, బందెల వెంకయ్య, కొల్లేటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు