
జమలాపురంలో ముగిసిన పవిత్రోత్సవాలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించాక మూలవరులు, ఉపాలయాల్లో దేవతల పవిత్రాలను విసర్జన చేశారు. అలాగే, యాగశాలలో మహాపూర్ణాహుతి, స్వామి వారికి చక్ర స్నానం నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఈఓ జగన్మోహన్‌రావు, అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
రేపటి నుండి సదరమ్ క్యాంపులు
ఖమ్మంవైద్యవిభాగం: దివ్యాంగులకు సదరమ్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ తెలిపారు. ఈనెల 7, 12, 14, 19, 21, 23, 26, 28, 30వ తేదీల్లో క్యాంపులు ఉంటాయని వెల్లడించారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైకల్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకున్న రశీదుతో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, వైద్యపరీక్షల రిపోర్టులతో హాజరుకావాలని సూచించారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: గ్రూప్స్, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు రాష్ట్ర మైనా ర్టీ స్టడీ సర్కిల్ ద్వారా నాలుగు నెలల పాటు ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్సీ అభ్యర్థులు ఈనెల 21లోగా దరఖా స్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్ తెలిపారు. విద్యార్హతల సర్టిఫికెట్లు జతచేసిన దరఖాస్తులను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సమర్పించాలని సమర్పించాలని ఆయన సూచించారు.
హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ బేగంపేట, రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి జిల్లాకు రెండు సీట్లు కేటాయించగా, ఈనెల 8వ తేదీ లోపు తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని సూచించారు. జనన, కుల, ఆదాయ, స్థానికత ధ్రువపత్రాలతో పాటు రేషన్, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారి అటెస్టేషన్‌తో దరఖాస్తుకు జతచేయాలని తెలిపారు. ఈనెల 10న డ్రా ద్వారా ఇద్దరిని ఎంపిక చేస్తామని డీడీ వెల్లడించారు.
ఇన్‌చార్జ్ డీఈఓగా
బాధ్యతల స్వీకరణ
ఖమ్మం సహకారనగర్: జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ మంగళవారం డీఈఓ కార్యాలయంలో ఇన్‌చార్జ్ డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఈఓ కార్యాలయ ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు ఆధ్వర్యాన నాయకులు సైతం ఇన్‌చార్జ్ డీఈఓను కలిశారు. పదోన్నతుల ప్రక్రియను పొరపాట్లు జరగకుండా పూర్తిచేయాలని కోరారు. పీఆర్‌టీయూ నాయకులు గుడిపుడి శ్రీనివాసరావు, చావా శ్రీనివాసరావు, లింగం సతీష్, పుసులూరి శ్రీనివాసరావు, శాంతారెడ్డి పాల్గొన్నారు.

జమలాపురంలో ముగిసిన పవిత్రోత్సవాలు

జమలాపురంలో ముగిసిన పవిత్రోత్సవాలు

జమలాపురంలో ముగిసిన పవిత్రోత్సవాలు