
పకడ్బందీగా పరిశీలన, పరిష్కారం..
భూభారతిలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. సాదాబైనామా దరఖాస్తుల అంశం హైకోర్టు పరిధిలో ఉండడంతో ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చాక చర్యలు తీసుకుంటాం. మిగిలిన దరఖాస్తుల్లో సర్వేనంబర్లు, పేర్లు తప్పుగా నమోదవడం, సర్వే నంబర్ లేకపోవడం వంటి సమస్యలు ఉండడంతో మొదటి, రెండు పేజీల్లో తప్పుల సవరణకు సిద్ధం చేస్తున్నాం. వారసత్వ పట్టాలకు సంబంధించి కొందరికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఎవరివైనా దరఖాస్తులు తిరస్కరించినా అందుకు కారణాన్ని తెలియజేస్తూ.. మిగిలిన దరఖాస్తులు వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం.
– అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్, ఖమ్మం
●