
కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు నమ్మరు
ఖమ్మంమయూరిసెంటర్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలు, అబద్ధపు మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మరని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ప్రాజెక్టుపై హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఖమ్మంలో మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. తొలుత తెలంగాణ ఉద్యమానికి మద్దతు అందించిన జార్ఖండ్ రాష్ట్ర సాధకుడు శిబూ సోరేన్ మృతిపై సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజ్, కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, దండా జ్యోతిరెడ్డి, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు గుండాల కృష్ణ, ఎం.డీ.ఖమర్, బెల్లం వేణుగోపాల్, వీరూనాయక్, పెంట్యాల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్