అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన
చింతకాని: చింతకాని మండలంలో శుక్రవారం తెల్ల వారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవగా రైతులు ఆందోళనకు గురయ్యారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యంపై పట్టాలు కప్పినా ఈదురుగాలులకు పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యం బస్తాలు తడిశాయి. కాంటా వేసి పది రోజులు దాటనా మిల్లులకు తరలించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని రైతులు ఆరోపించారు.
కూసుమంచిలో...
కూసుమంచి: మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఒక్కసారిగా వర్షం రావడంతో రైతులు అప్రమత్తమయ్యేలోగా ధాన్యం తడవగా నష్టం ఎదురైంది. కాంటా వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోగా, సకాలంలో మిల్లులకు తరలించకపోవటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు.
తల్లాడ మండలంలో..
తల్లాడ: తల్లాడ మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలగా, వైర్లు తెగిపడ్డాయి. ఫలితంగా అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావుపేట, కుర్నవల్లిల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక రైతులు ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవస్థ పడ్డారు. కాగా, మండలంలోని అన్నారుగూడెం దళితకాలనీలో సైడ్ డ్రెయిన్లు లేక వరద నీరు నిలవడంతో రాకపోకలకు దీంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన
అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన


