ఇటు తల్లిప్రేమ
అటు దేశ భ క్తి..
భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత అందరికీ ఆందోళన కలిగించింది. యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందోనన్న ఆదుర్దా సామాన్యుల్లో ఉండగా, సరిహద్దు వద్ద సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న వారి కుటుంబాలను ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆవేదన వెంటాడింది. రెండు దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటించినా, మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం సైనికుల కుటుంబాలను వీడడం లేదు. ఈనేపథ్యాన నేడు(ఆదివారం) అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న వారి తల్లులను పలకరించగా ఓ పక్క భయం.. ఇంకోవైపు ఆనందంవ్యక్తపరిచారు. తమ బిడ్డలు దేశసేవలో తరిస్తున్నారని సంతోషంగా ఉన్నా, యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోననే ఆందోళన కూడా వారిలో కనిపించింది. అయితే, కన్నపేగుకు మించి తమ బిడ్డలు భారతమాత సేవలో ఉన్నారనే వారు హర్షం వ్యక్తం చేయడం విశేషం.


