ధాన్యం కొనుగోళ్లు పరిశీలన
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం, ఎదుళ్లచెరువు, సుబ్లేడుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి ధనసిరి పుల్లయ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమశాతం, కాంటా, రవాణాపై ఆరా తీశారు. నిర్దేశిత తేమ నమోదు కాగానే కాంటా వేసి కేటాయించిన మిల్లులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యాన రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని డీఏఓ సూచించారు. ఏఓ సీతారాంరెడ్డి, పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
విద్యుత్ అభివృద్ధి పనులపై సమీక్ష
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్ సంబంధిత అభివృద్ధి పనులపై ఆ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఎన్పీడీసీఎల్ ఖమ్మం ఎస్‌ఈ ఈ.శ్రీనివాసాచారి, నోడల్ అధికారి నాగప్రసాద్ పర్యవేక్షణలో వీసీ నిర్వహించగా, వేసవి డిమాండ్‌కు అనుగుణంగా అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, 33 కేవీ ఇంటర్ లింకింగ్ పనులు, విద్యుత్ భద్రతా వారోత్సవాలు, 33 కేవీ, 11 కేవీ లైన్ల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల డీఈలు బాబురావు, భద్రుపవర్, నంబూరి రామారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, రాములు, హీరాలాల్, ఏడీఈలు పాల్గొన్నారు.
ఏఎంబీఐఎస్‌పై
పోలీసులకు శిక్షణ
ఖమ్మంక్రైం: ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఏఎంబీఐఎస్)పై పోలీసు ఉద్యోగులకు ఖమ్మంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా క్లూస్‌టీమ్ ఇన్‌స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ నేరం జరిగిన ప్రదేశం నుంచి నుండి నిందితుల వేలిముద్రలు తదితర ఆధారాల సేకరణ, ఐరిస్ స్కాన్ డేటా ఆధారంగా నిందితుల గుర్తింపునకు ఏఎంబీఐఎస్ ఉపయోగపడుతుందని ఎలిపారు. కొత్త క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ అమల్లో భాగంగా ఈ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేశారని చెప్పారు. నేరం జరిగిన ప్రదేశంలో వేలిముద్రల ఆధారంగా నేరస్తుల గుర్తింపు నూరు శాతం కచ్చితత్వంతో ఉంటుందని వెల్లడించారు.
వెదురు ఉత్పత్తుల
ప్రదర్శన
సత్తుపల్లిటౌన్: తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా సత్తుపల్లి వెదురు డిపోలో బుధవారం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెదురు విత్తనాలు, ఉత్పత్తులను ప్రదర్శించారు. అనంతరం 33లాట్ల వెదురు వేలం వేయగా, రూ.15.64 లక్షల ఆదాయం నమోదైంది. సత్తుపల్లి, పాల్వంచ డివిజనల్ మేనేజర్లు గణేష్, కవిత, డాక్టర్ శ్రీనివాస్, రేంజర్లు నాగరాజు, చంద్రకళ, బ్రహ్మచారి, గోపిప్రసాద్, సిద్ధార్థకుమార్ తదితరులు పాల్గొన్నారు.
10లోపు దరఖాస్తు
చేసుకోండి
ఖమ్మం సహకారనగర్: త్వరలో ఏర్పాటయ్యే ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సెంటర్ల(ఈడీసీ) లో పని చేసేందుకు ఆసక్తి ఉన్న ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఎంఎస్‌ఎంఈల పనితీరులో వేగం పెంచేలా జిల్లా పరిశ్రమల కేంద్రం వద్ద ఈడీసీలు ఏర్పాటుచేయనున్నట్లు తెలి పారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల మార్కెట్ పెంపు, రుణాల సమీకరణ, అభివృద్ధికి ఇవి తోడ్పాటునిస్తాయని, ఇందులో మేనేజ ర్, అసిస్టెంట్ మేనేజర్‌ను నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు 10వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని, వివరాలకు www.nimsme.gov.in వెబ్‌సైట్‌లో లేదా కలెక్టరేట్‌లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు పరిశీలన
ధాన్యం కొనుగోళ్లు పరిశీలన


