కుప్పకూలిన రాజు.. కాళ్లు విరిగిన గుర్రం
జిల్లా కేంద్రంలో మురికికూపంగా ఉన్న గోళ్లపాడు చానల్‌ను రెండేళ్ల క్రితం ఆధునికీకరించారు. అందులో భాగంగానే పలు చోట్ల పార్క్‌లు ఏర్పాటుచేశారు. వీటిలో సుందరయ్యనగర్ పార్క్‌లో భారీ పావులతో చెస్‌బోర్డు సైతం సమకూర్చారు. సాయంత్రం పార్క్‌కు వచ్చే చిన్నాపెద్ద ఈ చెస్‌బోర్డు వద్ద సరదాగా ఆడుకోవడంతో పాటు సెల్ఫీలు దిగేవారు. కానీ రానురాను దీన్ని ఎవరూ పట్టించుకోవడంతో నామరూపాలు లేకుండా పోతోంది. ఇప్పటికే రాజు కాయిన్ విరిగి కిందపడిపోగా, గుర్రం, ఏనుగు కాయిన్లు కూడా వాటి రూపాన్ని కోల్పోతున్నాయి.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్
కుప్పకూలిన రాజు.. కాళ్లు విరిగిన గుర్రం


