వాతావరణ ం | - | Sakshi
Sakshi News home page

వాతావరణ ం

Jun 22 2024 12:12 AM | Updated on Jun 22 2024 12:12 AM

వాతావ

వాతావరణ ం

జిల్లాలో శనివారం ఎండ ప్రభావంతక్కువగానే ఉంటుంది. పలు ప్రాంతాల్లో వర్షం కరిసే అవకాశాలు ఉన్నాయి.

డోంట్‌ వర్రీ.. నేనున్నా

మండల స్థాయి అధికారులెవరూ ఆసక్తి చూపకపోవడంతో జిల్లా అత్యున్నత అధి కారి అయిన కలెక్టరే గెజిటెడ్‌ సంతకం చేయడంతో దరఖాస్తుదారుల ఆనందానికి అవధుల్లేవు. చింతకానికి చెందిన కోలా పుల్లయ్య – సైదమ్మ దంపతుల పెద్దకుమార్తె శిరీష వివాహం ఇటీవల జరిగింది. కల్యాణలక్ష్మి చెక్కు కోసం ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు సిద్ధం చేసుకోగా, వాటిపై గెజిటెడ్‌ అధికారి సంతకం అవసరమైంది. వారం రోజులుగా ఆ దంపతులు ఏ అధికారి వద్దకు వెళ్లినా... గత అనుభవాల దృష్ట్యా సుముఖత చూపలేదు. ఇంతలోనే కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ గురువారం చింతకాని పీహెచ్‌సీలో తనిఖీకి వెళ్లేసరికి అక్కడి వైద్యుడి కోసం పుల్లయ్య దంపతులు వచ్చారు. వీరిని గమనించిన కలెక్టర్‌ ఆరా తీసి ఆయనే గెజిటెడ్‌ సంతకం చేసి కలెక్టరేట్‌లో స్టాంప్‌ వేయించుకోవాలని సూచించడంతో శుక్రవారం ఖమ్మం వచ్చారు. రోజులుగా తిప్పలు పడుతున్న తమను కలెక్టర్‌ కనికరించారని ఆనందంగా వెల్లడించారు.

వాతావరణ ం
1
1/1

వాతావరణ ం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement