
● పమ్మిలో అత్యధికంగా 44.2 డిగ్రీలు ● మిగతా ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ వారమంతా నానాటికీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 43.4, మంగళవారం 43.8గా నమోదు కాగా, బుధవారం ఏకంగా 44.2 డిగ్రీలకు చేరింది. జిల్లాలోని ముదిగొండ మండలం పమ్మిలో గరిష్టంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా చోట్ల కూడా 40డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం 8గంటలకే ఎండ మొదలై పది గంటల తర్వాత బయటకు రాలేని పరిస్థితి ఉంటోంది. కాగా, బుధవారం ఖమ్మంలో 43.9, కూసుమంచిలో 43.7, కల్లూరులో 43.6, నేలకొండపల్లి, గేట్ కారేపల్లిల్లో 43.5, తల్లాడ, తిరుమలాయపాలెంల్లో 43.3, తిమ్మారావుపేటలో 43.2, చింతకాని 43.1, సత్తుపల్లిలో 42డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు.