
ఖమ్మం లీగల్: ఖమ్మం న్యాయవాద సహకార సంఘంలోని నాలుగు డైరెక్టర్ పదవులకు మంగళవారం నిర్వహించిన ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 472 మందికి గాను 380 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, పలివెల శ్రీలక్ష్మి 292 ఓట్లు, అనుముల నర్సింహారావు 242, భూక్యా రమేష్ 219, దేవకి శ్రీనివాసరావు 208 ఓట్లు సాధించడంతో డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. అనంతరం సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కాసర్ల రాజుశేఖరరెడ్డి, ఉపాధ్యక్షుడిగా మహ్మద్ రఫీ, ప్రదాన కార్యదర్శిగా నోముల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా పిడతల రామ్మూర్తి, కోశాధికారిగా యాసా కాంతికుమారి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి జి.రమేష్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి కె.రవికుమార్ ప్రకటించారు.
విద్యుత్ ఉద్యోగుల నూతన కార్యవర్గాలు
దమ్మపేట: విద్యుత్ ఉద్యోగుల సంఘం (1104) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నూతన కార్యవర్గాలను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దమ్మపేట మండలం పార్కలగండిలోని వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం నిర్వహించిన విద్యుత్ ఉద్యోగుల ఉమ్మడి జిల్లాస్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా రమణారెడ్డి, శేషగిరిరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా హేమభద్రారావు, మోహన్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, సాయిబాబుతో పాటు సుధీర్, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
రాములోరి కల్యాణానికి పయనం
● 25ఏళ్లుగా హాజరవుతున్న ముస్లిం
కారేపల్లి: కారేపల్లికి చెందిన షేక్ మదార్‌సాహెబ్ భద్రాచలంలో జరగనున్న శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి వీక్షించేందుకు మంగళవారం బయలుదేరాడు. గత 25ఏళ్లుగా కల్యాణాన్ని వీక్షిస్తున్న ఆయన తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా స్వామి ప్రసాదం తీసుకొచ్చి గ్రామస్తులకు అందజేస్తానని మదార్‌సాహెబ్ తెలిపారు.
అగ్నికి ఆహుతైన
తాటివనం
ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురంలో తాటివనానికి గుర్తుతెలియని వ్యక్తులు మంగళవా రం రాత్రి నిప్పటించారు. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో గుర్తించిన గీత కార్మికులు ఫైర్‌స్టేషన్‌ను సమాచారం ఇచ్చారు. అలాగే, మరికొందరు ఘటనాస్థలికి చేరకుని సమీపంలోని వాటర్ క్యాన్ల ద్వారా నిప్పు ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతలోనే చేరకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే చాలాచెట్లు కాలిపోగా, తమ జీవనాధారమైన తాటిచెట్లకు నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గీత కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం కుమారస్వామిగౌడ్ ముదిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎన్నికల్లో గెలిచిన డైరెక్టర్లు

సమావేశంలో పాల్గొన్న విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు

మదార్‌సాహెబ్