ఖమ్మంక్రైం: ఖమ్మంలోని రోటరీ నగర్‌లో మహిళ నుంచి గొలుసు చోరీకి ఓ వ్యక్తి యత్నించాడు. రోటరీనగర్‌కు చెందిన కుమలి మంగమ్మ శనివారం సాయంత్రం బజార్ నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి మంగమ్మ మెడలో గొలుసు లాగటానికి ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా అరుస్తూ పెనుగులాడటంతో ఆగంతకుడి ప్రయత్నం విఫలం కాగా పారిపోయాడు. ఘటనలో మంగమ్మ కింద పడగా గాయాలయ్యాయి. ఈమేరకు సంఘటనా స్థలానికి ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, సీఐ బాలకృష్ణ చేరుకుని ఆగంతకుడిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు పుటేజీ పరిశీలించారు.