దుప్పట్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

దుప్పట్ల పంపిణీ

Nov 10 2026 12:07 AM | Updated on Nov 10 2026 12:07 AM

హుబ్లీ: ఎమ్మెల్యే కులకర్ణి జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నవనగర్‌ మైత్రి వృద్ధాశ్రమంలో వృద్ధులు, గాంధీ నగర్‌లోని సమర్థనం దివ్యాంగుల సంస్థలో దివ్యాంగులు, కలఘటికి రోడ్డు వన్నమ్మ విద్యాసంస్థ చెవిటి, మూగ పిల్లలకు, అలాగే జిల్లా ఆస్పత్రిలో బాలల విభాగంలో పండ్లు, మిఠాయలు పంచి పెట్టారు. అనంతరం దుప్పుట్లు అందజేశారు. కార్యక్రమంలో వినయ్‌ కుమారుడు హేమంత, ప్రముఖులు శ్యామ్‌, హనుమంత, గిరి, జయదేవ, నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.

హుండీల్లో నగదు చోరీ

హుబ్లీ: స్థానిక ఉనకల్‌ టీబీ రోడ్డు ఆనుకుని ఉన్న సిద్దేశ్వర హొసమఠం గర్భగుడి ఎదురుగా ఉన్న రెండు హుండీలను పగలగొట్టిన దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆన్‌లైన్‌ టాస్క్‌ పేరుతో వంచన

ఆన్‌లైన్‌ టాస్క్‌ పేరుతో ఓ వ్యక్తిని సైబర్‌ కేటుగాళ్లు రూ.లక్షల్లో వంచించారు. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టాస్క్‌ పూర్తి చేస్తే ఎక్కువ కమిషన్‌ ఇస్తామంటూ నమ్మించిన సైబర్‌ వంచకులు నగరానికి చెందిన వినాయకకు మెసేజ్‌ పంపించారు. ఈనెల 2 నుంచి 6 వరకూ నకిలీ వైబ్‌సైట్‌, అలాగే టెలిగ్రాం ద్వారా సంప్రదించిన వంచకులు టాస్క్‌ పేరున దశల వారీగా తమ బ్యాంక్‌ ఖాతాలకు వినాయక నుంచి రూ.15,69,624 బదలాయించుకున్నారు. అనంతరం వెబ్‌సైట్‌, టెలిగ్రామ్‌ ఛానల్‌ పని చేయక పోవడంతో బాధితుడు నగర సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కార్యాలయాలకు

బాంబు బెదిరింపులు

హుబ్లీ: హుబ్లీ, బెళగావి కార్పొరేషన్‌ కమిషనర్ల అధీకృత ఈ–మెయిల్స్‌కు సోమవారం వరుస బాంబు బెదిరింపు సందేశాలు రావడం కలకలం రేపింది. తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. హుబ్లీకి వచ్చిన ఈ–మెయిల్‌లో ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల సంస్థ పేరు కనిపించింది. హుబ్లీ ధార్వాడ కార్పొరేషన్‌ కమిషనర్‌కు వైట్‌స్మిత్‌ అనే ఐడీ నుంచి సుదీర్ఘమైన ప్రమాదకర ఈ–మెయిల్‌ వచ్చింది. ఈ–మెయిల్‌ ఖలిస్తాన్‌ నేషనల్‌ ఆర్మీ అండ్‌ బబ్బర్‌కల్సా ఫార్మర్‌ కెనాడ పేర్లను, అలాగే 1984 సిఖ్‌ నరమేధ విషయాన్ని పేర్కొంటూ బెదిరించారు. ఈ నెల 29న బెంగళూరు నైస్‌ సెంటర్‌ గ్రౌడ్‌లో జరిగే ప్రముఖ గాయకుడు దిల్‌జిత్‌ సంగీత కార్యక్రమ వేదికను బాంబుతో పేలుస్తామని చెప్పారు. ప్రజలు ఆ రోజు నైస్‌ గ్రౌడ్‌ వెళ్లకుండా ఆ రోడ్డులో ఐఫోన్‌ కనిపిస్తే ముట్టరాదన్న ఆందోళనకర సూచన చేశారు. అంతేగాక ఈ నెల 27న బాలిహుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాసం ఎదుట.. ఈనెల 29న బెంగళూరు మెట్రో స్టేషన్‌లలో మధ్యాహ్నం 3.11 నుంచి రాత్రి 11.11 గంటల్లోపు బాంబు పేలుస్తామని బెదిరించారు. దీంతో హుబ్లీ పాలికె కార్యాలయంలోని గదులన్నింటినీ డాగ్‌ స్వ్కాడ్‌, బాంబు స్వ్కాడ్‌ దళం క్షుణ్ణంగా పరిశీలించారు.

తేలిపోయిన తెల్ల బంగారం

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటకలో తెల్ల బంగారం తేలిపోయింది. మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది క్వింటాల్‌ పత్తి రూ.8,500 నుంచి రూ.9,000 వరకూ పలకగా.. నేడు రూ.6,800 నుంచి రూ.7,100 వరకూ ధర పలికింది. నూతన పత్తి మర్కెట్‌లో ధరలు ప్రకటించినప్పటికీ మిల్లు యజమానులు క్వింటాల్‌కు రూ.300 తగ్గంచి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలోని మక్తల్‌, నారాయణ పేట, మద్దూరు, ఊట్కూరు, గద్వాల దరూరు, నందిని, బలిగేర, మాదవరం ఇతర ప్రాంతాల నుంచి అధికంగా పత్తి బేళ్లు మార్కెట్‌కు వస్తున్నాయి. రాయచూరు, యాదగిరి, కలబుర్గి, కొప్పళ జిల్లాలో నీరందక పంట దిగుడులు అంతంత మాత్రమే ఉండటంతో రైతులకు పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు.

వైభవంగా దీపావళి వేడుకలు

సాక్షి, బళ్లారి: జిల్లా వ్యాప్తంగా ఆదివారం దీపావళి కోలాహలం నెలకొంది. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు చేయించారు. నరక చతుర్దశి, దీపావళి అమావాస్య ఒకేరోజు రావడంతో నగరం అంతా పటాసుల మోతతో హోరెత్తిపోయింది. ప్రతి ఇంట్లో మహిళలు దీపాలు వెలిగించారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా బాణాసంచా పేలుస్తూ ఆనందసాగరంలో మునిగితేలారు.

రాయచూరు రూరల్‌: రాయచూరు, కలబుర్గి యాదగిరి జిల్లాలో దీపావళి పండుగ ఘనంగా జరుపుకున్నారు. యాదగిరి శివ నగర్‌లో గిరిజన లంబాడీ యువతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాటలు పాడుతూ చేసిన నృత్యం ఆకట్టుకుంది.

ప్రైవేట్‌ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

డి.హీరేహాళ్‌ (బొమ్మనహాళ్‌): బళ్లారి పట్టణం అలుకుంది గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని హిర్దేహాళ్‌ గ్రామానికి చెందిన గంగాధర్‌ (39) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హిర్దేహాళ్‌ గ్రామం నుంచి బళ్లారి వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఆదివారం ఉదయం అలుకుంది గ్రామ శివారులో వెనుకు నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్‌ బస్సు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన గంగాధర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. బళ్లారి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement