సమాజ సేవ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

సమాజ సేవ ముఖ్యం

Nov 10 2026 12:07 AM | Updated on Nov 10 2026 12:07 AM

రాయచూరు రూరల్‌: పదవులు పొందడం కాదు.. సమాజానికి సేవలు అందించడం ముఖ్యమని మాజీ మంత్రి బోసురాజ్‌ పేర్కొన్నారు. నగరంలోని పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగమందిరంలో అఖిల భారత క్రైస్తవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ కర్ణాటక క్రైస్తవ మహాసభ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత అధిక సంఖ్యలో ఉన్నందున సమాజ అభివృద్ధికి ముందుండాలని సూచించారు. ఉత్తమ సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరికీ సహకారం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాస్టర్లతో పాటు కళ్యాణ కర్ణాటక క్రైస్తవ మహాసభ అధ్యక్షుడు స్టీవెన్‌ బిన్నీ, దామస్‌ బెంజిమన్‌, ఇమాన్యుయేల్‌, రామకృష్ణ ప్రసాద్‌, మోసెస్‌, జయన్న, రమేష్‌, విరూపాక్షి, సతీష్‌, శాంతప్ప, శాలం, క్రిస్టోఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

మొబైల్‌ ఫోన్లు, నగదు చోరీ

హుబ్లీ: దీపావళి పండుగ ఒకే రోజు సాయంత్రం ధార్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మార్కెట్‌లో 30కు పైగా మొబైల్‌ ఫోన్లు చోరీకి గురయ్యాయి. పండుగ సందర్భంగా ధార్వాడ సుబాష్‌ రోడ్డు తదితర చోట్ల జనం పండుగ కోసం వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్న క్రమంలోనే దొంగలు తమ చేతివాటం చూపారు. మొబైల్స్‌తో పాటు నగదు చోరీ చేశారు. ఈ చోరీ వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్‌కే ఉందని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ దొంగతనాలపై పోలీసులకు పూర్తిగా అవగాహన ఉందని.. దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం లేదని బాధితులు ఫిర్యాదుల్లో వాపోయారు.

కొనసాగుతున్న

ఆక్రమణల తొలగింపు

● ఇప్పటి వరకు టాస్క్‌ఫోర్స్‌ ద్వారా

150 ఎకరాల భూమి స్వాధీనం

సాక్షి, బళ్లారి: ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం జేసీబీ యంత్రాలతో సర్వే నంబర్‌ 607–1ఏలోని అక్రమణలను సంబంధిత అధికారులు తొలగించారు. ఈ సర్వే నంబర్‌ పరిధిలో 1.23 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్రమించుకున్న 150 ఎకరాలు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

హోటల్‌ యాజమానిపై చర్యలు తీసుకోండి

రాయచూరు రూరల్‌: లింగసూగూరు తాలూకా ఈచనాల (ఇత్చానాల్‌) గ్రామంలోని హోటల్‌ యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్ష సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మరియప్ప కత్తిమనికి హోటల్‌ యజమాని శివప్ప శరణప్ప హడపద నీరు తాగడానికి గ్లాస్‌ ఇవ్వడానికి నిరాకరించాడన్నారు. దానికి బదులుగా గ్లాసుతో నీటిని పైనుంచి అతని చేతుల్లోకి (దోసిట్లోకి) ఎత్తి పోశాడని మండిపడ్డారు. వివక్షకు పాల్పడిన హోటల్‌ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసనల తీవ్రత పెరగడంతో శాంతిభద్రతల దృష్ట్యా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి (అరెస్ట్‌) తీసుకున్నారు.

31 శాతం ఇథనాల్‌

ఆందోళనకరం

బళ్లారిఅర్బన్‌: రాష్ట్రంలో పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్‌ కలుపుతున్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో వెల్లడైందని, ఇది ఆందోళనకరమని మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఇథనాల్‌ వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. జిల్లాలో హోటళ్లలో ఆహార కల్తీపై సోదాలు జరపాలని డిమాండ్‌ చేశారు. తుంగభద్ర జలాశయం నుంచి డిసెంబర్‌ 15 వరకు కుడి కాలువలకు నిరంతరాయంగా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆటో రిక్షాలు పంపిణీ

హుబ్లీ: హుబ్లీ–ధార్వాడ కార్పొరేషన్‌ నిధులతో ఆరుగురు లబ్ధిదారులకు సోమవారం ఆటో రిక్షాలు పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ.. లబ్ధిదారులు స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బి.శ్రీరాములు, బంగారు హనుమంతు, కార్పొరేటర్‌ శాంతి హిరేమఠ, శివయ్య హిరేమఠ, బసవరాజ, వినాయక్‌, శశికాంత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement