టపాసుల మోతకు పక్షుల మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

టపాసుల మోతకు పక్షుల మృత్యువాత

Nov 10 2026 12:07 AM | Updated on Nov 10 2026 12:07 AM

హొసపేటె: దీపావళి వేళ బాణసంచా మోత మూగజీవాల పాలిట మృత్యుఘోషగా మారుతోంది. విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని రాజీవ్‌ గాంధీ నగర్‌లో భారీ శబ్ధాలతో పేల్చిన టపాసుల ధాటికి చిలుకలతో పాటు పలు పక్షులు మృత్యువాత పడ్డాయి. మరో వైపు నవజాత శిశువులు, వృద్ధులు, గుండె సంబంధిత వ్యాధులు, చెవి సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న భారీ శబ్దాల బాణసంచా విక్రయాలు, వినియోగంపై కఠిన ఆంక్షలు విధించాలని వందేమాతరం జాగృతి వేదికతో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధుల డిమాండ్‌ చేస్తున్నారు. భారీ శబ్ధాలు వచ్చే టపాసుల విక్రయాలను పూర్తిగా నియంత్రించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన ఆనందం మూగజీవాల మరణానికి కారణం కాకూడదు.. పండుగ సంబరాలు ఇతరుల ప్రాణాలు, ఆరోగ్యానికి ముప్పుగా మారకూడదని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement