చిక్క జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

చిక్క జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Nov 10 2026 12:07 AM | Updated on Nov 10 2026 12:07 AM

చింతామణి: ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. బంధువుల మధ్య దీపావళిని ఆచరించి సంతోషంగా గడపాలని కొందరు, వ్యక్తిగత పనులపై వెళ్తున్న మరికొందరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టైరు పేలి అదుపు తప్పిన బొలెరో వాహనం.. ఆటో, బస్సు, బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురికి బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటన చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి తాలూకాలో చోటు చేసుకుంది. వివరాలు.. చింతామణి తాలూకా చేలూరు నుంచి బొలెరో వాహనంలో రైతులు బొప్పాయి కాయలు నింపుకుని సోమవారం రాత్రి బెంగళూరు బయల్దేరారు. చింతామణి రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని చొక్కరెడ్డిపల్లి వద్దకు రాగానే టైరు పేలింది. దీంతో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను, బైక్‌ను, ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న చింతామణి జేజే కాలనీకి చెందిన రామాంజమ్మ (48) అక్కడికక్కడే మరణించగా గాయపడిన ప్రియాంక, తన్మయ, లావణ్యను చింతామణి ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలైన వెంకటేశ్‌ను చిక్కబళ్లాపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరంతా బంధువుల ఇంటికి ఆటోలో దీపావళి పండుకు వెళ్తూ ప్రమదానికి గురయ్యారు. బొలెరో కిందకు బైక్‌ దూసుకెళ్లగా చింతామణి తాలూకా బ్రహ్మణహళ్లికి చెందిన శ్రీనివాసరెడ్డి (55), నరస్మమ్మ (50) దంపతులు మరణించారు. ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలి మంజునాఽఽథ్‌, స్వీటీ అనే వారికి గాయాలయ్యాయి. మంజునాఽథ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటన స్థలాన్ని డీఎస్పీ రఘు, సీఐలు విజికుమార్‌, శివకుమార్‌ పరిశీలించారు.

మృతులు శ్రీనివాసరెడ్డి, నరసమ్మ, రామాంజమ్మ

టైరు పేలి ఆటో, బైక్‌, బస్సును

ఢీకొన్న బొలెరో

ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి

ఆరుగురికి తీవ్ర గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement