వేడుకగా కన్నడ రాజ్యోత్సవం | - | Sakshi
Sakshi News home page

వేడుకగా కన్నడ రాజ్యోత్సవం

Nov 3 2026 12:09 AM | Updated on Nov 3 2026 12:09 AM

బళ్లారిఅర్బన్‌: జిల్లా వాణిజ్య పారిశ్రామిక సంస్థ ఆధ్వర్యంలో 71వ కన్నడ రాజ్యోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కన్నడ మాత భువనేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కన్నడ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు అవ్వార్‌ మంజునాథ్‌ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చిన చారిత్రక సందర్భమే కన్నడ రాజ్యోత్సవమని అన్నారు. మైసూరు రాష్ట్రానికి కర్ణాటకగా నామకరణం చేసిన నవంబర్‌ 1వ తేదీని ప్రతి సంవత్సరం కన్నడిగులు గర్వంగా జరుపుకుంటారన్నారు. సంస్థ గౌరవ కార్యదర్శి కేసీ.సురేశ్‌బాబు మాట్లాడుతూ 1956 నవంబర్‌ 1న కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను విలీనం చేసి మైసూరు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. అనంతరం 1973 నవంబర్‌ 1న మైసూరు రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్చారన్నారు. మాతృభూమి, భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి కన్నడిగుడి బాధ్యత అని అన్నారు. సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.దొడ్డనగౌడ, ఉపాధ్యక్షులు సొంతా గిరిధర, పి.పాలన్న, సంయుక్త కార్యదర్శులు డాక్టర్‌ మర్చేడ్‌ మల్లికార్జున గౌడ, వి.రామచంద్ర, మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ డీఎల్‌.రమేష్‌ గోపాల్‌, వివిధ కమిటీల అధ్యక్షులు నేకార నాగరాజ్‌, నాగళ్లి రమేష్‌, టి.శ్రీనివాసరావు, పీ.వేణుగోపాల్‌ ప్రసాద్‌, భాషా, కౌడికి హనుమేష్‌ బాబు, కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ప్రత్యేక సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement