భగవంతుని దర్శనభాగ్యం సుకృతం | - | Sakshi
Sakshi News home page

భగవంతుని దర్శనభాగ్యం సుకృతం

Nov 3 2026 12:09 AM | Updated on Nov 3 2026 12:09 AM

రాయచూరు రూరల్‌ : గురువులతో పాటు భగవంతుడిని దర్శించే భాగ్యం కలగడం రాయచూరు భక్తుల సుకృతమని తెలుగు ీసినిమా పాత్రికేయుడు వీ.ఎస్‌.ఎన్‌.మూర్తి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుని ఆయన మాట్లాడారు. దేశ, విదేశాల్లో సాయి మందిరాలను చూశానని, రాయచూరులో సాయిబాబా, శనీశ్వరుల ఆలయాలు ఉండటం విశేషమన్నారు. మురళీ యాదవ్‌, ఉమాకాంత్‌, లక్ష్మణ్‌, విజయ బసవ, శ్రీశైల, కిరణ్‌, కేశవమూర్తిలున్నారు.

శారీరక ఆరోగ్యం కాపాడుకోవాలి

రాయచూరు రూరల్‌: మానవుడు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ అరుణాంగ్షు గిరి పేర్కొన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ క్రీడాంగణంలో ఎన్‌ఎస్‌ బోసురాజు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిస్టర్‌ కర్ణాటక రత్న–2026 దేహదారుఢ్య పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఆత్మరక్షణ కోసం కరాటేను నేర్చుకోవాలన్నారు. పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొనేలా చేసిన యాజమాన్యం మరింత ముందడుగు వేసి రాష్ట్ర స్థాయి పోటీలను ఏర్పాటు చేయాలన్నారు. డీఎస్పీ శాంతవీర, సీఐలు అమరేష్‌, సాబయ్య, ఎస్‌ఐ మంజునాథ్‌, పోటీల నిర్వాహకులు సుధాకర్‌, విశ్వనాథ్‌, రిషబ్‌ హర్ష, ఆకాశ్‌, వైశిష్టలున్నారు.

వందేభారత్‌ రైలుకు స్వాగతం

రాయచూరు రూరల్‌: కేంద్ర ప్రభుత్వం నూతనంగా బెంగళూరు–ముంబై మధ్య ప్రారంభించిన వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైలుకు బెంగళూరులో శ్రీకారం లభించింది. ఈ రైలుకు ఆదివారం రాత్రి కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి, కలబుర్గి రైల్వే స్టేషన్లలో అధికారులు, నేతలు హడావిడి సృష్టించి ఘనస్వాగతం పలికారు. రాయచూరులో మాజీ లోక్‌సభ సభ్యుడు రాజా అమరేశ్వర నాయక్‌, దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌, యాదగిరిలో శాసన సభ్యులు చెన్నారెడ్డి పాటిల్‌ తన్నూరు, శరణేగౌడ కందకూరు వందే భారత్‌ రైలుకు పచ్చ జెండాలతో స్వాగతం పలికారు.

రైతులకు కరువు పరిహారం అందించాలి: మంత్రి

హొసపేటె: జిల్లాలో కరువుతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించడంతో పాటు, పంటల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కే.బసవంతప్ప అధికారులకు సూచించారు. హొసపేటెలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం మంత్రి అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, వ్యవసాయ రంగం పై దాన్ని ప్రభావం, పంట నష్టాల అంచనా, రైతులకు అందించాల్సిన కరువు సహాయం, పంటల బీమా పరిహారం తదితర అంశాల పై అధికారులతో విస్తృతంగా చర్చించారు. అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

కార్మిక చట్టాలపై నిరసన

రాయచూరు రూరల్‌: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. సోమవారం హరిజనవాడలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్‌, కార్మిక చట్టాలను జారీ చేయడంతో రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలు అన్ని విధాలుగా నష్టపోతారని ఆరోపించారు. ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు మద్దతుగా ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పు బట్టారు. మనరేగను తొలగించి వికసిత్‌ భారత్‌ మిషన్‌ రోజ్‌గార్‌ పేరును నమోదు చేశారన్నారు. మనరేగ పథకంతో నేడు వలసలు వెళుతున్న కూలీలు, కార్మికుల భవిష్యత్‌ అంధకారమైందన్నారు. దేశంలో 12 కోట్ల మంది వ్యవసాయ కూలీ కార్మికుల పొట్ట కొట్టారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement