కేంద్రం చెరకు ఎంఎస్‌పీని పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్రం చెరకు ఎంఎస్‌పీని పెంచాలి

Nov 3 2026 12:09 AM | Updated on Nov 3 2026 12:09 AM

హుబ్లీ: చెరకు రైతులు అంగీకరిస్తేనే చక్కెర కర్మాగారాలు ప్రారంభం అవుతాయని బెళగావి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సతీశ్‌ జార్కిహోళి తెలిపారు. ఆయన బెళగావిలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర ఫ్యాక్టరీల యజమానులు ఎలాంటి రిస్క్‌ తీసుకోడానికి సిద్ధంగా లేరు. ఈ సమస్య పరిష్కారానికి రైతు సంఘాలు, ఫ్యాక్టరీ యజమానుల మధ్య ఏకాభిప్రాయం కుదరాలి. అంతేగాక కేంద్రం ఎంఎస్‌పీ(కనీస మద్దతు ధర)ని పెంచితే మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం సాధ్యమని ఆయన అన్నారు. ఓసారి ఫ్యాక్టరీని ప్రారంభిస్తే బంద్‌ చేయిస్తారు. గత ఏడాది ఇలాగే జరిగింది. అందుకోసమే ఫ్యాక్టరీని ప్రారంభించాలని చెరకు రైతులే ముందుకు వచ్చి చెప్పాలి. అప్పుడే యజమానులు చెరకు నూర్పిడికి సిద్ధమవుతారన్నారు. చెరకు రైతుల జైల్‌ భలో ఆందోళన గురించి తెలియదన్నారు. రైతులు ఇక ముందు చేయబోయే పోరాటాల గురించి ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి తెలియదు. జిల్లాధికారి వద్దకు వచ్చి రైతు నేతలు మాట్లాడాలి. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. జిల్లాధికారిని అడిగితే తాను చర్చలకు సిద్ధం అని, రైతులు ముందుకు రావాలని అన్నారని మంత్రి స్పష్టీకరించారు. కేంద్ర మంత్రి జోషి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఎస్‌ఏపీని ప్రకటించాలని చేసిన వ్యాఖ్యలపై ముందుగా కేంద్రం ఎంఎస్‌పీని పెంచకుండా మా తలపై భారం వేస్తే ఎలా అన్నారు. ప్రస్తుతం ఉన్న చక్కెర ధరను అధికారికంగా ప్రకటించడానికి కేంద్రం సిద్ధంగా లేదని మండిపడ్డారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement