రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకాలో పోత్నాళ వాగు పూర్తిగా ఎండిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఎడమ గట్టు వైపున 35 గ్రామాలు, కుడి గట్టు వైపున 25 గ్రామాల ప్రజలు ఈ వాగు నీటిపై ఆధార పడ్డారు. తుంగభద్ర డ్యాం నుంచి కాలువలకు నీరు విడుదల చేసిన సమయంలో వాగులో నీరు ప్రవహిహించేవి. నేడు వర్షాభావంతో తాగునీటి ఎద్దడి తీవ్రమై గ్రామాల్లో హాహాకారాలు మొదలయ్యాయి. తాగునీటి కోసం ప్రజలు అక్కడక్కడ వాగులో చెలిమలు తవ్వుతున్నారు. మరో వైపు కొందరు చెలిమల ద్వారానే నీటి దప్పికను తీర్చుకుంటున్నారు. వాగుతో పాటు తుంగభద్ర నదీ పరివాహక గ్రామాలైన పోత్నాళ, నందిహాళ, దడేసూగూరు, హిరేహళ్ల, జాగీర్ పన్నూరు తదితర గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అధికమైంది.
వాగు నీటిపైనే ఆధారపడిన గ్రామాలు
తాగునీటి కోసం తప్పని ఇబ్బందులు


