పండుగకు పద పద సొంతూళ్లకు | - | Sakshi
Sakshi News home page

పండుగకు పద పద సొంతూళ్లకు

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

బనశంకరి: దసరా పండుగకు వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో నగరంలో తీవ్ర ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. బెంగళూరులో చదువులు, ఉద్యోగాలు, పనుల కోసం వచ్చిన లక్షలాది మంది సొంతూళ్లలో పండుగ చేసుకోవడానికి శుక్రవారం రాత్రి నుంచే వెల్లువలా బయల్దేరారు. మెజస్టిక్‌ కేఎస్‌ ఆర్టీసీ బస్టాండుకు తరలిరావడంతో కిటకిటలాడింది. వర్షం రావడంతో సంచారం నిదానంగా సాగింది. దీంతో చాలామంది సకాలంలో బస్సులను అందుకోలేకపోయారు. తరువాతి బస్సు కోసం గంటలకొద్దీ పడిగాపులు పడాల్సి వచ్చిందని వాపోయారు. సాధారణ రోజుల్లో కెంపేగౌడ బస్టాండు చుట్టుపక్కల ట్రాఫిక్‌ ఉంటుంది. పండుగ సమయంలో చెప్పాల్సిన పని లేదు, కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలబడతాయి. బస్సులు, కార్లతో మెజెస్టిక్‌, మల్లేశ్వరం, రాజాజీనగర, పీణ్యా, మైసూరు రోడ్డు, బళ్లారి రోడ్డు, హెబ్బాళ, యశవంతపుర, గురగుంటెపాళ్య, ఆనేకల్‌తో పాటు ప్రముఖ రోడ్లలో తీవ్ర ట్రాఫిక్‌ ఏర్పడింది.

ఎక్కడ చూసినా వాహనాలే

శనివారం ఉదయం ప్రయాణికులు బస్టాండ్లకు రావడంతో రద్దీ మరింత పెరిగింది. ఆర్టీసీ అదనపు బస్సులను నడిపినప్పటికీ ఏమాత్రం చాలలేదు. ప్రైవేటు బస్సుల్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే సీట్లు దక్కాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎంత శ్రమించినా వాహన రద్దీ తీరలేదు. మైసూరు రోడ్డు, తుమకూరు రోడ్డు 8వ మైలు టోల్‌గేట్‌, మాదావర, నెలమంగల, నైస్‌ రోడ్డు, హోసూరు రోడ్డు, ఎయిర్‌పోర్టు రోడ్డు, మైసూరు రోడ్డు టోల్‌గేట్లలో పొడవైనా క్యూలు ఏర్పడ్డాయి. బెంగళూరు దాటేవరకు ప్రయాణికులు చుక్కలు చూశారు.

బెంగళూరులో బస్టాండ్లు, రోడ్లు కిటకిట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement