మైసూరు: దసరా సంబరాలలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రైతు దసరాలో తమ ఎద్దులకు దాణా, నీరు లేవు, తమకు కూడా అల్పాహారం అందించలేదని బైఠాయిచారు. శనివారం కుక్కరహళ్లి చెరువు దగ్గర కాంతరాజ అరసు రోడ్ సర్కిల్లో వందలాది మంది రైతులు నిరసన తెలిపారు. హళ్లికార్ ఎద్దుల ప్రదర్శన కోసం నిర్వహించారని, కానీ రైతులు పిల్లల్లా పెంచుకునే ఆ ఎద్దులకు అధికారులు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని, మురికినీరు పెట్టారని మండిపడ్డారు.
నీళ్లు, తిండి లేవు
మంచి పశుగ్రాసం ఇవ్వలేదని, శుక్రవారం రాత్రి పొలాల నుంచి వచ్చిన రైతులకు అల్పాహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జిల్లా యంత్రాంగం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ, తమను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. జిల్లా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని బైఠాయించారు. రోడ్డును దిగ్బంధించడంతో తీవ్ర అంతరాయం కలిగింది. డీసీపీ సుందరరాజు చర్చించినా ఫలితం లేదు. దసరాకు రైతులను పిలిచి అవమానిస్తారా? అని నిరసనకారులు ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం జరిగింది. కొంతసేపటికి రైతులు శాంతించారు.
వసతులు కల్పించలేదని నిరసన


