బొమ్మనహళ్లి: రైతుల సమస్యల గురించి నాకు పూర్తిగా తెలుసు. మీ డిమాండ్ల పరిష్కారానికి చక్కెర కర్మాగారాల యజమానులు, కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతానని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. ఉత్తర కర్ణాటక జిల్లాల చెరకు రైతులు పలు డిమాండ్లతో వారంరోజుల నుంచి హైవేలను, రహదార్లను దిగ్బంధించి ఆందోళను చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం బెళగావి కిత్తూరులో చెరకు రైతుల ఆందోళనా సభలో సీఎం మాట్లాడారు. వచ్చే వారం బెంగళూరు లేదా బెళగావిలో సమావేశం ఏర్పాటు చేసి చెరుకు రైతుల, సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.
మీ బాధ అర్థమైంది
‘మీ బాధ నాకు అర్థమైంది. మీ బలాన్ని, పోరాటాన్ని నేను చూశాను. మీపై ఉన్న ప్రేమ, అభిమానంతో మిమ్మల్ని కలవడానికి వచ్చాను. పరిష్కారానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల, పాదయాత్రను ఇక్కడితో ఆపాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను‘ అని అభ్యర్థించారు. తాను ప్రధానితో భేటీకి అపాయింట్మెంట్ కోరానన్నారు. మహాదాయి ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచామన్నారు. నిరసనలను ఇంతటితో విరమించాలని విన్నవించారు.
మీ డిమాండ్ల పరిష్కారానికి కృషి
కిత్తూరు రైతుల సభలో సీఎం డీకే


