బెళగావిలో బాపూజీ స్మారకం | - | Sakshi
Sakshi News home page

బెళగావిలో బాపూజీ స్మారకం

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

యువ సంభ్రమ
బెళగావిలో బాపూజీకి స్మారకం

జాతిపిత గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు సీఎం డీకే నివాళులు

బెంగళూరులో గాంధీజీ స్మారకాన్ని ప్రారంభించిన సీఎం డీకే.శివకుమార్‌

బనశంకరి: బెళగావిలో మహాత్మా గాంధీజీ పాల్గొన్న కాంగ్రెస్‌ సమావేశం నిర్వహించి వందేళ్లు పూర్తయిన సందర్భంలో అక్కడ రూ.100 కోట్లతో భారీ స్మారకం నిర్మిస్తామని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ తెలిపారు. బెంగళూరులోని గాంధీభవన్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ స్మారకాన్ని సీఎం ప్రారంభించి మాట్లాడారు. బెళగావిలో గాంధీ స్మారక నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను కాపాడటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో గాంధీజీ ప్రతిమ ఏర్పాటు చేశారన్నారు. ప్రపంచ నాయకులందరూ గాంధీజీని ఆదర్శంగా తీసుకున్నారన్నారు. గాంధీజీ సందర్శించిన అన్ని జిల్లాల్లో స్మారకాల నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గాంధీజీ మ్యూజియాన్ని సీఎం ప్రారంభించారు. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్‌ అర్షద్‌, గాంధీ భారత శతమానోత్సవ సమితి అధ్యక్షుడు హెచ్‌కే.పాటిల్‌, బీఎల్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

బెంగళూరులో చారిత్రక క్షణం

మహాత్మాగాంధీ సతీమణి కస్తూరిబాతో కలిసి 1915 మే 8 తేదీ శనివారం మొదటిసారిగా బెంగళూరుకు విచ్చేశారు. అప్పటి ప్రభుత్వ పాఠశాల(నేడు ప్రభుత్వ కాలేజీ) ని సందర్శించి తమ రాజకీయ గురువులైన గోపాలకృష్ణ గోఖలే ఫొటోను ఆవిష్కరించారు. ఆ జ్ఞాపకంగా సభాంగణానికి బాపూజీ పేరు పెట్టారు. ప్రస్తుతం అదే ఆవరణలో మొదట గాంధీ స్మారక స్తంభం నిర్మించారు. మైసూరు ప్రముఖ శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ స్మారకాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

నైస్‌ బాధితులకు కుమార అండ

ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

బీజేపీ కుట్రలు, కుతంత్రాలు బహిర్గతం చేస్తా

బనశంకరి: బీజేపీ కుట్రలు, కుతంత్రాలను బహిర్గతం చేస్తానని సీఎం డీకే.శివకుమార్‌ ధ్వజమెత్తారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం విధానసౌధలో మహాత్మాగాంధీ విగ్రహం, లాల్‌బహద్దూర్‌శాస్త్రి చిత్రపటానికి సీఎం డీకే.శివకుమార్‌ పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. 54 లక్షల ఓట్ల గల్లంతుపై ఆరోపణలు రుజువు చేయాలని విజయేంద్ర చేసిన సవాల్‌ గురించి మాట్లాడుతూ తనపై ఫిర్యాదు చేస్తే చేయనీయండి, చాలా సంతోషం అన్నారు. ఎన్నికల కమిషనర్లు అయోగ్యులు కాదన్నారు. ఎన్నికల కమిషనర్‌తో సర్‌ లోపాలపై వివరించానన్నారు. ఎన్ని లక్షల ఓట్లు డిలీట్‌ చేశారు అనేది బయటకు వస్తుందన్నారు. సీఎంపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేయడంపై మాట్లాడిన సీఎం డీకే.శివకుమార్‌ వారు ఏం చేశారో తెలియదా? అన్నారు. విపక్షం కళ్లకు గంతలు కట్టుకుని పని చేసిందని విమర్శించారు.

ధర్నా చేస్తే తప్పేంటి?

ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వద్ద ధర్నా చేయడాన్ని సమర్థించుకున్న సీఎం తాను కార్యాలయంలోనే ఉన్నానన్నారు. తాను రోడ్డులో కూర్చోలేదన్నారు. తాను ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇచ్చానని తెలిపారు. తమ పోరాటం కారణంగా ఎన్నికల కమిషన్‌ దర్యాప్తు చేయడానికి సిద్ధమైందని తెలిపారు. బీజేపీ రాజకీయాల్లో కొనసాగడానికి తగదు అని, పోలీసులు ముందుగా వారిని అరెస్ట్‌ చేయాలన్నారు. బీజేపీ నేతలకు సిగ్గుండాలని సీఎం ధ్వజమెత్తారు. 24 వేల ఓట్ల డిలీట్‌కు మాత్రమే దరఖాస్తు చేశామని బీజేపీ నేతలు ఒప్పుకున్నారని, వారిని అరెస్ట్‌ చేయాలని, లేకుంటే వీరంతా రాజకీయాల్లో ఉండటానికి పనికి రారని బీజేపీ, జేడీఎస్‌లపై ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement