మహాత్ముడికి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

మహాత్ముడికి ఘన నివాళి

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

హొసపేటె: విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న

అధికారులు

గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి నివాళి

గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్న డీసీ నాగేంద్ర ప్రసాద్‌

సాక్షి, బళ్లారి: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతిని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. బళ్లారి నగరంలోని జిల్లా అధికారి కార్యాలయం ఎదుట రాజ్‌కుమార్‌ పార్కు పక్కన ఉన్న గాంధీజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ మోకా తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్య్రోద్యమంలో మహాత్మా గాంధీజీ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. సత్యం, అహింస, శాంతియుత పోరాటాన్ని ఆయుధంగా చేసుకుని బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాయలంలో..

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్‌ ఆధ్వర్యంలో గాంధీజీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. సత్యం అహింస, ప్రజా ఉద్యమం ద్వారా బ్రిటిష్‌ తెల్లదొరలను గాంధీ తరిమికొట్టారన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించి దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బోయపాటి విష్ణు, వెంకటేష్‌ హేగ్డే, ఎల్‌.మారెన్న తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అధికారి కార్యాలయంలో..

స్థానిక జిల్లా అధికారి కార్యాలయంలో బాపూజీ జయంతి నిర్వహించారు. భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ తదితర అన్ని మతాల సారాంశం ఒక్కటే అని తెలిపారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. వ్యాస రచనలో పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.

ఎల్‌ఐసీ ఆఫీసులో..

బళ్లారి రూరల్‌: బళ్లారి ఎల్‌ఐసీ బ్రాంచ్‌–2లో లియాఫీ (ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి, జయంతి జరుపుకున్నారు. మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో లియాఫీ ప్రముఖులు బి.వీరయ్యశెటి, లక్ష్మీనాయణ, వీరేశయ్య, రాఘవేంద్రశెట్టి, హెచ్‌.ఎం.కొట్రేశ్‌, గౌరి శంకర్‌,ఎల్‌ఐీసీఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రముఖుడు సూర్య నారాయణ, బ్రాంచ్‌ మేనేజర్‌ సుందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

రాయచూరులో..

రాయచూరు రూరల్‌: నగరంలో మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి జరిగింది. జిల్లా అధికారి పూవిత, ఎస్పీ అరుణాంగ్శు గిరి, నగర సభ కమిషనర్‌ జుబీన్‌ మెహపాత్రో, యవజన సేవా క్రీడాధికారి వీరేష్‌ నాయక్‌, సర్కారీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, ఏసీ హంపన్న పాల్గొన్నారు. కాంగ్రెస్‌ కార్యాలయంలో విధాన పరిషత్‌ సభ్యుడు వసంత్‌ కుమార్‌ తదితరులు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శాంతప్ప తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి మాజీ విధాన పరిషత్‌ సభ్యుడు శంకరప్ప పూలమాల వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement