దొడ్డబళ్లాపురం: దేవుడి ఎద్దుపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన బెళగావి జిల్లా అథణి తాలూకా ఖిలేగాంవ బసవణ్ణ క్షేత్రంలో చోటు చేసుకుంది. క్షేత్రంలో చాలా ఏళ్లుగా దేవుడికి వదిలిన ఎద్దును స్థానికులు పూజిస్తున్నారు. అది ఊరంతా తిరుగుతూ ఉంటుంది. జనం ఎద్దుకు ఆహారం అందిస్తుంటారు. ఎద్దు కూడా ఏనాడూ ఎవరికీ హాని తలపెట్టలేదు. అలాంటిది తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు ఎద్దుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో తిరుగుతున్న ఎద్దును గమనించిన స్థానికులు చికిత్స అందించారు. అథణి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల ఆచూకీ కనిపెట్టే పనిలో పడ్డారు.


