హోసూరు: హోసూరు పట్టణ పోలీసులు బైక్‌లో గంజాయి దాచుకుని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా.. హోసూరు పట్టణ పోలీసులు శుక్రవారం హోసూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వాహనం నడుపుకుని వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ను పరిశీలించగా రెండు కిలోల గంజాయి పట్టుబడింది. హోసూరు పారిశ్రామికవాడ బేడరపల్లి ప్రాంతానికి చెందిన ప్రభాకర్, బేగేపల్లి ప్రాంతానికి చెందిన పూంజోలైను అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని అక్రమంగా దిగుమతి చేసుకుని పట్టణ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


