పోరాటమే స్ఫూర్తి.. ఇంట్లో ఆగిన ఊపిరి | - | Sakshi
Sakshi News home page

పోరాటమే స్ఫూర్తి.. ఇంట్లో ఆగిన ఊపిరి

Aug 28 2026 2:27 AM | Updated on Aug 28 2026 2:27 AM

తుమకూరు: తుమకూరు జిల్లాలోని శిర పట్టణంలో ఒకే ఇంటిలో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద రీతిలో శవాలయ్యారు. శిర పట్టణ శివార్లలోని సర్వే నం.100 స్థలంలోని ఓ ఇంట్లో రబియా (30), ఆమె ఇద్దరు కుమార్తెలు తమన్నా (9), సిమ్రాన్‌ (5) మరణించారు. వారి మరణానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. గురువారం ఉదయం ఇంట్లోనే ముగ్గురూ మరణించి ఉన్నారు. జిల్లా ఎస్పీ కె. వి. అశోక్‌ కుమార్‌, డీఎస్పీ శేఖర్‌ మొక్కావో, అర్బన్‌ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు ఆ ఇంటిని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

పట్టుబట్టి ఇంటి స్థలం

రబియా నివసించడానికి ఇంటి స్థలం హక్కు కోసం జిల్లా పరిపాలనా యంత్రాంగంతో పోరాడి, ఉప ముఖ్యమంత్రి ద్వారా స్థలాన్ని సంపాదించి, ఇల్లు కట్టుకోవడం ప్రారంభించింది. రబియా, తన పోరాటంతో పేరు తెచ్చుకుంది. ఇటీవల జరిగిన నగర పరిషత్తు సమావేశంలోనూ రబియా ఇంటి నిర్మాణం గురించి చర్చ జరిగింది.

తల్లి, ఇద్దరు కూతుళ్ల

అనుమానాస్పద మృతి

శిరలో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement