ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్టు
దొడ్డబళ్లాపురం: రామనగర గ్రామీణ పోలీసులు ముగ్గురు చైన్ స్నాచర్‌లను అరెస్టు చేశారు. మండ్య జిల్లా మళవళ్లి తాలూకా లింగాపట్టణ గ్రామ నివాసి దర్శన్(21),హలగూరు గ్రామ నివాసి మనోజ్(24),చెన్నపట్టణ తాలూకా కెంచయ్యనదొడ్డి గ్రామానికి చెందిన రాజు(26)ను అరెస్ట్ చేసి రూ.7.11లక్షల విలువైన 53.300 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రామనగర తాలూకా కూనముద్దనహళ్లి గ్రామంలో 2025 సెప్టెంబర్ 25న జయమ్మ అనే మహిళ మెడలోంచి నిందితులు బంగారు చైన్ లాక్కుని పరారయ్యారు. వీరు ఇంకా అనేక చైన్‌స్నాచింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారని విచారణలో తేలింది.


