పంకజతో ప్రపంచ స్థాయికి..
బొమ్మనహళ్లి: బెంగళూరు యువ దర్శకురాలు అనూయ స్వామి రూపొందించిన ’పంకజ’ అనే కన్నడ లఘు చిత్రం అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత ’సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’కు ఎంపికై న మొదటి కన్నడ లఘు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని స్టార్ అగర ప్రభుత్వ పాఠశాల అమ్మాయి, న్యూయార్క్‌లో జర్నలిజం, సినిమాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్న తెలంగాణకు చెందిన అనూయ బెంగళూరులోని అగరలోని ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న పద్మశ్రీ అనే అమ్మాయిని ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. హర్షణి ఆనే మహిళ ఆ బాలిక తల్లి పాత్రను పోషించింది. శుక్రవారం చిత్ర బృందం పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు.
అమెరికాలో ప్రదర్శిస్తున్నందుకు హర్షం
ఈ సందర్భంగా బాలనటి పద్మశ్రీని సత్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. తను నటించిన చిత్రం అమెరికాలో ప్రదర్శిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉంది అని బాలిక పద్మశ్రీ అన్నారు. దర్శకురాలు అనూయ స్వామి మాట్లాడుతూ ‘నా తల్లిదండ్రులది తెలంగాణ రాష్ట్రం అని, కాని తాను అగర గ్రామంలో పుట్టి పెరిగాను. నేను పుట్టి పెరిగిన దేశంలో అది కూడా కన్నడ నాడులో నా మొదటి లఘు చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నాను‘ అని అన్నారు. నేను ప్రామాణికతకు చాలా ప్రాముఖ్యత ఇస్తాను. నేను ఏ ప్రముఖ కళాకారుడినీ ఎంచుకోవాలనుకోలేదు. ఒక కొత్త వ్యక్తికి అవకాశం దొరికితే, వారు ఆ పాత్రకు చాలా సహజంగా, నిజాయితీగా ప్రాణం పోస్తారని నాకు నమ్మకం ఉంది. అది ఇప్పుడు నిజమైందని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రం ప్రత్యేకత
‘పంకజ’ షార్ట్ ఫిల్మ్ మానవ జీవితంలోని షాక్, విచారం, అస్పష్టత వంటి లోతైన ఇతివృత్తాలను సున్నితంగా అల్లుకుంది. ఈ చిత్రాన్ని హెచ్.ఎస్.ఆర్. లేఅవుట్, మల్లేశ్వరం, అగర, పోలీస్ స్టేషన్, బెంగళూరులోని రాళ్ల క్వారీలలో చిత్రీకరించారు. ఈ చిత్రం కోసం 50 మందికి పైగా సాంకేతిక సిబ్బంది కష్టపడి పని చేశారు అని అగర ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నడ రంగస్వామి సంతోషం వ్యక్తం చేశారు.
చరిత్రలో కన్నడ సినిమా సరికొత్త మైలురాయి
అంతర్జాతీయ దృష్టిని
ఆకర్షించిన దర్శకురాలు అనూయ


