నేత్రపర్వం.. శివయోగి బ్రహ్మ రథోత్సవం
● నంజనగూడు సుత్తూరు మఠంలో జనసంద్రం
మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని సుత్తూరు మఠంలో జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం ముఖ్య ఘట్టమైన శివరాత్రి శివయోగి రథోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి సింహాసనాన్ని అలంకరించి పూజలు చేశారు. 6 గంటలకు మఠం రుద్రాభిషేకం జరిగింది. 10.30 గంటలకు విశేష పూజల మధ్య శివయోగి ఉత్సవమూర్తిని తేరులో ప్రతిష్టించారు. ఉదయం 11 గంటలకు, సిద్ధగంగ మఠం శివ సిద్ధేశ్వర స్వామి, సుత్తూరు శివరాత్రి దేశికేంద్ర స్వామి తదితరులు డోలు వాయించి, నంది జెండాకు ప్రార్థనలు చేసి తేరును లాగారు. రోబో ఏనుగు, ఆదిజగద్గురు శివరాత్రేశ్వరుడు, శివయోగి చిత్రపటంతో ముందుకు కదులుతుండగా 21 ఫిరంగులు పేల్చబడ్డాయి. వేలాది మంది భక్తులు తేరును లాగారు. కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తేరు ఉత్సవంలో 40 కళా బృందాలు వైవిధ్య ప్రదర్శనలతో రక్తి కట్టించాయి. వీరభద్ర నృత్యం, వాయిద్యాల ఘోష వేడుకకు వన్నె తెచ్చాయి.
నేత్రపర్వం.. శివయోగి బ్రహ్మ రథోత్సవం
నేత్రపర్వం.. శివయోగి బ్రహ్మ రథోత్సవం
నేత్రపర్వం.. శివయోగి బ్రహ్మ రథోత్సవం


