లక్కుండి ప్రాశస్త్యం
● లక్కుండి చరిత్రను అవలోకిస్తే ముందుగా ఇక్కడ లక్కుండి గ్రామం లేదు. సప్త గ్రామాల అగ్రహారంగా ఉండేది. సొకమనకట్టి, తంగాబెంచి, జవళబెంచి, నరసీపుర, మోటి బసప్ప, బూదిబసప్ప, లక్కుండి గ్రామాలతో కూడి ఉండేది.
● విజయనగర రాజుల పాలన తరువాత ఏడు గ్రామాల ప్రజలు లక్కుండికి వచ్చి ఉండేవారు.
● రాష్ట్రకూటులు, చాళుక్యులు, హొయసళ రాజులు ఇక్కడి నుంచి పరిపాలించడంతో చారిత్రకంగా గొప్ప స్థానం ఏర్పరచుకుంది. వందలాది శిల్పకళతో కూడిన కట్టడాలు ఇక్కడ కనువిందు చేస్తాయి.
● ఇక్కడ నాణేలను తయారుచేసే టంకశాలలు ఉండేవని చరిత్ర చెబుతోంది. ఇక్కడ విస్తారంగా ఉన్న ప్రాచీన ఆలయాలలో అక్కడక్కడ ఆ ఆధారాలు లభిస్తాయి.
● అంతేకాకుండగా వెండి, బంగారం, ముత్యం, రత్నం తదితర వస్తువులు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ దొరుకుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
● పూర్తిస్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తవ్వకాలు జరిపితే ప్రాచీన నిధి నిక్షేపాలు అనేకం బయటపడతాయనే ప్రచారం సాగుతోంది.
శివాజీనగర: గదగ్ జిల్లా లక్కుండి గ్రామంలో వారం కిందట గంగవ్వ అనే మహిళ ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా రాగి కలశంలో సుమారు 460 గ్రాముల బంగారు నిక్షేపం దొరకడంతో అక్కడ పరిస్థితి మారిపోయింది. ఈ చారిత్రక గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిశోధనలు ప్రారంభించారు. ప్రాచీన నిధులు ఉంటాయన్న అంచనాతో లక్కుండిలోని కోటి వీరభద్రేశ్వర దేవాలయ ఆవరణలో తవ్వకాలను చేపట్టారు. ఇందులో పురాతన కాలానికి చెందిన ఓ శిలాకృతి బయటపడింది. ఒకటిన్నర అడుగుల పొడవు ఉంది. 10 మీటర్ల పొడవు, అంతే వెడల్పు ప్రాంతంలో తవ్వకాలు సాగుతున్నాయి. తవ్వకాల పని ముగిసేవరకు ఆలయ ఆవరణలోకి ప్రజల ప్రవేశాన్ని నిషేధించినట్లు జిల్లాధికారి సీ.ఎన్.శ్రీధర్ తెలిపారు. అక్కడ ఫొటోలు, వీడియోలు తీయడాన్ని కూడా నిషేధించామన్నారు. పర్యాటకశాఖ, ఆర్కియాలజీ, మ్యూజియంల విభాగం అధికారులు తవ్వకాల్లో పాల్గొంటున్నారు. పలు జేసీబీలు, ఇతర పరికరాలతో పాటు 20 మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు.
వీరభద్రేశ్వర ఆలయంలో తవ్వకాలు ప్రదేశం
లక్కుండిలోని ప్రాచీన ఆలయాలలో ఒకటి
భారీ ఎత్తున తవ్వకాలకు ప్రణాళిక
వీరభద్రేశ్వర ఆలయంలో అన్వేషణ
గ్రామాన్ని ఖాళీ చేయించే అవకాశం
గ్రామస్తుల తరలింపు?
మరోవైపు లక్కుండిలో కొన్ని వందల కుటుంబాలు ఉండగా, వారిని పూర్తిగా మరోచోటుకు తరలించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. వీరభద్రేశ్వర ఆలయంలో జరుగుతున్న తవ్వకాలలో ఏవైనా పురాతన నిధులు లభిస్తే.. లక్కుండి కథ మారిపోతుంది. ఇక్కడి నుంచి జనావాసాలను తొలగించి ఖాళీ చేయిస్తాము. ఆపై భారీఎత్తున తవ్వకాలు జరుపుతాము. ప్రజలకు ఇతర గ్రామాల్లో పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ భూగర్భంలో అపారమైన సంపదలు దాగి ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.
లక్కుండి ప్రాశస్త్యం
లక్కుండి ప్రాశస్త్యం
లక్కుండి ప్రాశస్త్యం
లక్కుండి ప్రాశస్త్యం


