రైలు ఢీకొని వ్యక్తి మృతి
బళ్లారిఅర్బన్: బళ్లారి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గమ్మ గుడి అండర్ బ్రిడ్జిపై నడుచుకుంటూ పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన సుమారు 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తిని రైలు ఢీకొనడంతో మరణించిన ఘటన గురువారం జరిగింది. వివరాలు.. ఉదయం బళ్లారి నుంచి గుంతకల్లు వైపునకు వెళుతున్న జోధ్‌పూర్– బెంగళూరు రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ నాగరాజ్, ఏఎస్‌ఐ శివమూర్తి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే రైలును అక్కడే నిలిపి వేశారు. రైలులో ఉన్న గార్డ్ పరిశీలించి మృతదేహాన్ని పట్టాల పైనుంచి పక్కకు మళ్లించారు. ఉదయం సుమారు 6.25 గంటల సమయంలో ఈ ఘటన జరగగా 7.30 గంటలకు మృతదేహాన్ని బీఎంసీఆర్‌సీ మార్చురీకి రైల్వే సిబ్బంది, పోలీసు బృందం అంబులెన్స్ సాయంతో తరలించారు. గంటకు పైగా మైసూరు, వారణాసి, చిక్కజాజూరుతో కలిపి మొత్తం మూడు రైళ్లను బళ్లారి స్టేషన్‌లోనే నిలిపి వేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడ్డారు. రెండు ట్రాక్‌ల మధ్యలో సేఫ్టీ ప్లాట్‌ఫాం వేసి ఉంటే ప్రాణాలతో బయట పడేవారని అక్కడి వాసులు తెలిపారు. ఈ ఘటనతో రైలు అక్కడే నిలిచిపోగా, బ్రిడ్జి కింద అండర్ గ్రౌండ్‌లో కూడా సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది.
రైలు ఢీకొని వ్యక్తి మృతి


