ఎంతో సున్నితమైన హృదయానికి ఇబ్బంది వచ్చింది. భారత సిలికా
కారణాలపై నెలకొన్న
సందిగ్ధం
శివాజీనగర: బెంగళూరు నగరంలో కోవిడ్ మహమ్మారి తరువాత గుండెపోటుతో మరణాలు అధికమయ్యాయి. నగర పోలీసు విభాగం ఈ మేరకు గుండె ఝల్లుమనే సమాచారాన్ని పొందుపర్చింది. ఆ గణాంకాల ప్రకారం 2022 నుంచి బెంగళూరులో ఏటా సరాసరి 3000 హఠాన్మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రబలిన తరువాత అనేకమందికి ఈ సమస్య తలెత్తింది. దీనిమీద అనేక భిన్న ప్రచారాలు జరగడం తెలిసిందే. కోవిడ్ వైరస్ సోకిన తరువాత గుండె బలహీన పడుతుందని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలామందికి హృదయ సమస్యలు వస్తున్నాయని ప్రచారాలు వ్యాప్తిలోకి వచ్చాయి. కొన్ని వైద్య సంస్థలు కోవిడ్ టీకాతో ఇబ్బంది లేదని ప్రకటించాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగినట్లు తేటతెల్లమైంది.
అధికమైన ఆకస్మిక మరణాల ముప్పు ఏటా 3000 మంది మరణం కరోనా తరువాత విపరిణామాలు
ప్రతి సంఘటన నమోదు..
గుండెపోటు మరణాలు కలకలం రేకెత్తించడంతో రాష్ట్ర ప్రభుత్వం హఠాన్మరణాలను నమోదు చేయాలని, పోస్టుమార్టం కూడా జరిపి కారణాలను నిర్ధారించాలని గతేడాది ఆదేశించింది. ఇళ్లలోను, బయట ఆకస్మిక మరణం సంభవిస్తే దానిని పోలీసులు, వైద్యులు నమోదు చేయాలని తెలిపింది. ఆరోగ్యంగా ఉన్నవారు, 15 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలతో పాటుగా అందరూ సంవత్సరానికి ఓసారైనా గుండె, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో 86 వైద్యాలయాల్లో ఉన్న పునీత్ రాజ్‌కుమార్ హృదయ జ్యోతి పథకాన్ని తాలూకా స్థాయి ఆసుపత్రులకు విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆకస్మిక గుండెపోటు బాధితులకు తక్షణ చికిత్స అందించడమే ఈ పథకం ఉద్దేశం.
ఇతరత్రా కారణాలు ఉన్నాయి: నిపుణులు
ఆకస్మిక గుండెపోటు మరణాలకు అనేక అంశాలు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలలో అడ్డంకులు, శ్వాసకోశాల్లో రక్తం గడ్డ కట్టడం, అనియంత్రిత ఆస్తమా సమస్య, తీవ్రమైన అలర్జీలు, మితిమీరి మద్యం, పొగాకు సేవనం, జన్యు పరమైన ఇబ్బందులు వల్ల కూడా గుండెకు ఇబ్బంది కలిగి హఠాత్ మరణాలు సంభవించవచ్చని తెలిపారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని జాగృతి ర్యాలీలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు తదితరాలను ఆరోగ్య శాఖ ఏర్పాటు చేస్తోంది. మితాహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయాలని, అధిక చక్కెర, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు తెలిపారు.
ఎంతో సున్నితమైన హృదయానికి ఇబ్బంది వచ్చింది. భారత సిలికా
ఎంతో సున్నితమైన హృదయానికి ఇబ్బంది వచ్చింది. భారత సిలికా


