ఆర్టీసీ బస్సు– లారీ ఢీ
మైసూరు: చామరాజనగర తాలూకాలోని నంజనగూడు రోడ్డులో బెండరవడి గ్రామం సమీపంలో కేఎస్ ఆర్టీసీ (అశ్వమేధ) బస్సు, లారీ ఢీకొన్నాయి, రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. బస్సు, లారీ క్యాబిన్లను గ్యాస్ కట్టర్ తో కత్తిరించి డ్రైవర్లను బయటకు తీసుకువచ్చారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, గ్రామస్తుల సహకారంతో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బయటకు తీసేటప్పటికి బస్సు డ్రైవర్ మృతి చెందగా, లారీ డ్రైవర్‌తో సహా మొత్తం 18 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్, కో–ఆపరేటివ్ మంజు (38), చామరాజనగర తాలూకాలోని ఇరసావడి గ్రామవాసి, లారీ డ్రైవర్ గోవిందస్వామి (45) కూడా ఇదే తాలూకావాసే కాగా తీవ్ర గాయాలయ్యాయి. శివకుమార్, గీత దంపతులు సహా నలుగురు తీవ్ర గాయాలతో మైసూరులోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఐదుగురు సిమ్స్‌లో చికిత్స పొంది వెళ్లిపోయారు.
చెట్టును బస్సు ఢీ.. 20 మంది ఆస్పత్రిపాలు
యశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా హళియాళ తాలూకా బానసగేరి వద్ద జరిగింది. 8 మంది కాలేజీ విద్యార్థులు, ఇద్దరు మొరార్జీ వసతి స్కూలు విద్యార్థులు, ఇద్దరు మహిళలతో పాటు కండక్టర్ గాయపడ్డారు. ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి రోడ్డు పక్కలోని చెట్టును బస్సు ఢీకొంది. స్థానికులు వచ్చి బాధితులను కాపాడారు.
ఇద్దరు విద్యార్థులను..
● కలబుర్గి జిల్లా జీవర్గి వద్ద సైకిల్‌పై స్కూల్‌కు వెళుతున్న దవలసాబ్ (15) అనే 9వ తరగతి విద్యార్థిని కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో చేయి, నడుములకు తీవ్ర గాయాలై విషమ పరిస్థితిలో ఉన్నాడు. జీవర్గి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
● హావేరి తాలూకా కోణనతంబిగికి చెందిన పీయూసీ విద్యార్థి రోహిత్ కెసరళ్లి కాలేజీలో పరీక్ష రాయడానికి నడిచి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొంది. అతనికి తీవ్ర గాయాలు తగిలాయి. హావేరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
డ్రైవర్ మృతి, 18 మందికి గాయాలు
చామరాజనగర వద్ద ప్రమాదం
రాష్ట్రంలో పలుచోట్ల బస్సు యాక్సిడెంట్లు
ఆర్టీసీ బస్సు– లారీ ఢీ


