కుమారా.. నీ పాఠాలొద్దు
శివాజీనగర: మంత్రిగా నాకు కుమారస్వామి కంటే అధిక అనుభవముంది. ఎవరితో సమావేశం జరపాలి అనేది నాకు బాగా తెలుసు. ఆయన నుంచి పాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. గురువారం కేపీసీసీ కార్యాలయంలో కొందరు జేడీఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ బళ్లారిలో తాను ఏ అధికారంలో పోలీసు అధికారులతో సమావేశం జరిపానని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రశ్నించడాన్ని ప్రస్తావించారు. జేడీఎస్‌కు ఒక సిద్ధాంతం, తత్వం ఏదీది లేదు. అది త్వరలోనే బీజేపీలో విలీనం కావచ్చని అన్నారు. రాష్ట్రంలో లెక్కకు మూడు పార్టీలు. ఆడేందుకు రెండు పార్టీలు అన్నట్లు అయిందని ఎద్దేవా చేశారు. ఇది ఎన్నికల సంవత్సరమని, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని తెలిపారు. బెంగళూరు పాలికె ఎన్నికలు వస్తున్నాయన్నారు.
అసోం పరిశీలకునిగా..
ఈ సందర్భంగా కాబోయే సీఎం డీ.కే.శివకుమార్ అని కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ డీకేను అసోం ఎన్నికలకు సీనియర్ పరిశీలనకునిగా నియమించింది. ఇది సీఎం కుర్చీ మార్పిడి గొడవకు హైకమాండ్ ఇచ్చే విరామమని అందరూ భావిస్తున్నారు.
త్వరలో బీజేపీలో జేడీఎస్ విలీనం
డీసీఎం శివకుమార్


