చీటీల పేరుతో రూ.100 కోట్లు ఉఫ్?
● పరారీలో ఫైనాన్స్ వ్యాపారి
● బళ్లారి నగరంలో భారీ వంచన
● బాధితులు లబోదిబో
సాక్షి, బళ్లారి: చీటీలంటే చీటింగ్‌గా మారిపోయింది. కొన్నాళ్లపాటు జనం నమ్మకం సంపాదించాక పెద్దమొత్తంలో ఉడాయిస్తుంటారు. బళ్లారి నగరంలో అలాంటి భారీ స్కాం బయటపడింది. వివరాలు.. నగరంలోని దేవీనగర్‌కు చెందిన వెంకటేశ్ అనే ఫైనాన్స్ వ్యాపారి చీటీలు నిర్వహించేవాడు. ఇలా దాదాపు 800 మంది నుంచి చీటీలు వేశారు. కట్టిన సొమ్ముకు రెట్టింపు నగదు ఇస్తానని నమ్మబలికేవాడు. దీంతో చాలామంది సంపాదించుకున్న డబ్బుతో పాటు అప్పులు చేసి అతనికి చెల్లించారు. ఈ మొత్తం సుమారు రూ.100 కోట్ల దాకా ఉంటుందని బాధిత ప్రజలు చెబుతున్నారు.
పత్తా నై..
గత రెండు మూడు రోజులుగా వెంకటేశ్ జాడ లేకపోవడంతో గురువారం మధ్యాహ్నం లబోదిబోమన్నారు. బ్రూస్‌పేట పోలీసు స్టేషన్ ముందు చేరి నిరసన తెలిపారు. కొందరు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ ధరకే బంగారమంటూ ఇటీవలే ఓ వ్యాపారి జనం నుంచి రూ.50 కోట్ల దాకా వసూలు చేసి ఐపీ పెట్టడం తెలిసిందే.
చీటీల పేరుతో రూ.100 కోట్లు ఉఫ్?


