అంగన్‌వాడీలకు పౌష్టికాహారం అందించరూ
రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం సగం మేర బంద్ చేశారని అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. బుధవారం మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు పద్మ మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు వయస్సు గల పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ విషయంలో సర్కార్ కేవలం గుడ్డు, గోధుమ పిండి, బియ్యం, పొడి, చిన్నపాటి సరుకులు ఇస్తుందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు పిల్లలతో పాటు ఇతర పనులు అప్పగించడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి లోపాలు రాకుండా పని చేస్తున్నారన్నారు. న్యాయసమ్మతంగా విధులు నిర్వహించే కార్యకర్తలపై ఆరోపణలను పరిగణనలోకి తీసుకోకూడదని అధికారి నవీన్‌కు వినతిపత్రం సమర్పించారు.


