మహా దాసోహకు భారీగా అప్పడాల తయారీ
హొసపేటె: గవిసిద్దేశ్వర జాతర మహోత్సవంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జాతర మహోత్సవం మూడో బుధవారం ప్రత్యేక వంటకంగా అప్పడాల పంపిణీ జరిగింది. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలోని సిరిగేరికి చెందిన గవిశ్రీ స్నేహ ఫ్రెండ్స్ గ్రూప్, ఉదయ ఫ్రెండ్స్ గ్రూపుతో గత 8 ఏళ్లుగా వివిధ ఇమి, జిలేబీ తయారీ సేవల్లో పాల్గొంటున్నారు. సిద్రాంపుర, హావినహాళ, సిరిగేరి, దాసాపుర, కొంచగేరి, ముద్దటనూరు, గుండిగనూరు, పరిసర ప్రాంతాల గ్రామస్తుల సహకారంతో ఈ సంవత్సరం అప్పడాల పంపిణీ సేవను చేపట్టారు. అప్పడాల తయారీకి 14 డబ్బాల నూనె, 50 మంది వంట వారు, వారికి సహాయం చేయడానికి 20 మందిని అందించారన్నారు. మొత్తం రూ.5 లక్షల అప్పడాలను తయారు చేసి జాతరకు వచ్చిన భక్తులకు ఉచితంగా చేసినట్లు గవిమఠం ప్రతినిధులు తెలిపారు.


