గరుడ రాష్ట్ర అవార్డు ప్రదానం
బళ్లారి అర్బన్: సండూరు తాలూకా గరుడ న్యూస్ సంపాదకులు మహేష్ కమ్మత్తూర బృందం ఆధ్వర్యంలో 2026వ సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రశస్తి సమాజ సేవా రత్న అవార్డును డీ.అరుణ్‌కుమార్‌కు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. అరుణ్‌కుమార్ కర్ణాటక జలహిత రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడుగా, వందేమాతరం యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడుగా, జగజ్యోతి బసవేశ్వర యువక సంఘం గౌరవ అధ్యక్షుడుగా, నెహ్రు యువ కేంద్రంతో పాటు వివిధ రంగాల్లో సేవలు అందించారు. బళ్లారికి చెందిన ఈయన సమాజ సేవను మెచ్చి గరుడ న్యూస్ అవార్డుకు ఎంపిక చేశామని గరుడ న్యూస్ నిర్వాహకులు తెలిపారు. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు తనకు మరింతగా సేవ చేసేందుకు ప్రోత్సాహం లభించిందన్నారు. తాను శాయశక్తులా సమాజ చేయడం ద్వారా ఆపన్నులకు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.


