మిస్‌ఫైర్ కాదు, పక్కా ఫైరే
సాక్షి బళ్లారి: నగరంలో జనవరి 1వ తేదీన తన ఇంటి వద్ద కాల్పులు జరిగింది మిస్‌ఫైర్‌తో కాదని, పథకం ప్రకారమే కాల్పులు జరిపి రాజశేఖర్ అనే యువకుడి మృతికి కారకులయ్యారని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు ఆరోపణలు చేశారు. బుధవారం తన నివాసం గృహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఘటన జరిగిన రోజు వీడియోలను మీడియాకు విడుదల చేశారు. పెద్ద టీవీ స్క్రీన్‌పై వాటిని ప్రదర్శించారు. మృతుడు రాజశేఖర్ కూడా తమ ఇంటిపై బాటిల్ విసిరాడన్నారు. అదే సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో చిందర వందరగా వదిలి వెళ్లిపోయారన్నారు. బ్యానర్ కట్టే సమయంలో ఘర్షణ ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి రావడంతో మళ్లీ గొడవ ప్రారంభమైందన్నారు.
పెద్ద రగడ చేయాలని హైడ్రామా
పథకం ప్రకారం తమ వారిపై కాల్పులు జరిపి పెద్ద రగడ చేయాలని హైడ్రామా చేశారన్నారు. ఆ వీడియో చూస్తే మిస్‌ఫైర్ కాదు, పథకం ప్రకారం ఫైర్ చేశారనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డిని, సతీష్‌రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని లేకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం ఖాయమన్నారు. 17వ తేదీన ఆందోళన చేపడతామని, సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ బళ్లారిలో విలేకరులతో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన శాంతి భద్రతలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఎమ్మెల్యే భరత్‌రెడ్డి రాకతోనే
మళ్లీ గొడవ ప్రారంభం
విలేకరులతో మాజీ మంత్రులు
గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు


