శాంతి భద్రతల రక్షణే ధ్యేయం
రాయచూరు రూరల్: నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని ఎస్పీ అరుణాంగ్షు గిరి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్‌ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలన్నారు. నగరంలో రాత్రి వేళ పోకిరీల ఆగడాలు అధికం అయ్యాయని, వాటిని అరికట్టాలన్నారు. షేస్‌బుక్, వాట్సప్, ట్విటర్, ఇన్‌స్టా వంటి వాటిని వినియోగించే ముందు ఆలోచించుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ కాంబ్లే, సాబయ్య, లక్ష్మిలున్నారు.
పాఠశాలల మూసివేత
నిరసిస్తూ ఆందోళన
రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాలలోకి విలీనం చేయడానికి సర్కార్ ముందుకొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమనే ఆదేశాలను జారీ చేయాలని ఏఐడీఎస్‌ఓ డిమాండ్ చేసింది. బుధవారం రాయచూరు తాలూకా దేవసూగురు ప్రాథమిక పాఠశాల వద్ద చేపట్టిన ఆందోళన సంచాలకులు అయ్యప్ప,చెన్నబసవ మాట్లాడారు. ప్రాథమిక పాఠశాల విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలను మూసేయడం లేదని చెప్పిన సమాధానానికి లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
పిల్లల అపహరణలు అరికట్టాలి
రాయచూరు రూరల్: జిల్లాలో పిల్లల కిడ్నాప్ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని రాయచూరు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి హన్మంతు అనంతరావ్ సాత్విక్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఎస్పీ కార్యాలయంలో న్యాయ సేవా ప్రాధికార, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల రక్షణ శాఖాధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధికారులకు సలహా సూచనలు ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధిక భాగం పిల్లలు, మహిళలు, యువతులు అధికంగా కిడ్నాప్, విక్రయాలు చోటు చేసుకుంటున్న కేసులు అధికంగా నమోదైందని, అలాంటి వాటిపై నిఘా ఉంచాలని సూచించారు. ఎస్పీ అరుణాంగ్షు గిరి, ఏఎస్పీ కుమారస్వామి, డీఎస్పీ శాంతవీర, ఇతర పోలీస్ అధికారులున్నారు.
శాంతి భద్రతల రక్షణే ధ్యేయం


