హంపీ, అంజనాద్రిలో వైఎస్సార్‌సీపీ నేత ఉమా
సాక్షి బళ్లారి: వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రముఖ వైఎస్సార్‌సీపీ నాయకుడు ఉమా మహేశ్వరనాయుడు హంపి, ఆనెగుందిని దర్శించుకొన్నారు. బుధవారం ఆయన హంపీలోని విరుపాక్షేశ్వరస్వామి, భువనేశ్వరిదేవి, పంపాదేవి, కోదండరామ ఆలయం, యంత్రోద్ధారక శ్రీఆంజనేయస్వామి ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. చారిత్రాత్మకమైన హంపి కట్టడాలను వీక్షించారు. హంపీలోని విజయవిఠల ఆలయం, రాతిరథం, మహానవమిదిబ్బ, కమల మహల్ తదితర స్మారకాలను వీక్షించి శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ ప్రాంతాన్ని సువర్ణయుగంగా చేశారని కొనియాడారు. అనంతరం ఆంజనేయస్వామి జన్మస్థలమైన అంజనాద్రిని దర్శించి అంజనాద్రి కొండపై 575 మెట్లను ఎక్కి కొండపై వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చలు కూడా చేయించారు.
హంపీ, అంజనాద్రిలో వైఎస్సార్‌సీపీ నేత ఉమా


