కంది ధరలు తగ్గుముఖం.. ఆందోళనలో రైతాంగం
రాయచూరు రూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మార్కెట్‌లో ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, కలబుర్గి, యాదగిరి, కొప్పళ వంటి జిల్లాలోల రైతులు పండించిన కంది పంటకు మార్కెట్‌లో ధర పూర్తిగా పడిపోయింది. కళ్యాణ కర్ణాటకలో 10 లక్షల టన్నుల కందులు కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కలబుర్గి, రాయచూరు ఏపీఎంసీల్లో నెలరోజుల్లో ధర క్వింటాల్‌కు రూ.వెయ్యి తగ్గింది. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.8,169 ధర ప్రకటించారు. జనవరి 1 నుంచి 4వ తేదీ వరకు 28,967 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. గతంలో 75,185 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో వైపు కంది పంటకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులు జిల్లాధికారి కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు.
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్
కంది ధరలు తగ్గుముఖం.. ఆందోళనలో రైతాంగం


