జిల్లా ఎస్పీగా సుమన పెన్నేకర్
సాక్షి బళ్లారి: మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి ఇంటి సమీపంలో మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ బ్యానర్ గొడవ, కాల్పుల నేపథ్యంలో తాజాగా పోలీసు అధికారులపై కూడా రాష్ట్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బుధవారం బళ్లారి రేంజ్ డీఐజీపీగా పని చేస్తున్న వర్తిక కటియార్‌ను బదిలీ చేశారు. రగడ జరిగిన రోజు ఆమె కూడా సక్రమంగా విధులు నిర్వహించలేదనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రతిపక్షం కూడా ఎస్పీ సస్పెండ్‌ను ఖండిస్తూ వచ్చింది. దీంతో కటియార్‌ను బదిలీ చేసి ఆమె స్థానంలో బళ్లారి రేంజ్ డీఐజీపీగా పీఎస్.హర్షను నియమించారు. ఇక బళ్లారి నూతన ఎస్పీగా సుమన పెన్నేకర్‌ను నియమించారు. కాగా బళ్లారి కాల్పుల ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది.
డీఐజీ వర్తికా కటియార్ బదిలీ
నూతన డీఐజీగా హర్ష నియామకం
కాల్పుల ఘటనతో అధికారులపై చర్యలు
జిల్లా ఎస్పీగా సుమన పెన్నేకర్


