ఆనేకల్‌లో భారీ భూ డీల్
బొమ్మనహళ్ళి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలో ఓ ఐటీ సంస్థ 53.5 ఎకరాల భూమిని మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించడం పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసుపై బెంగళూరు జిల్లా కలెక్టర్ దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవిన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ తెలిపారు.
ఏమిటీ డీల్..
ఓ ఐటీ సంస్థ ఆనేకల్ తాలూకాలోని తన 53.5 ఎకరాల భూమిని రియాల్టీ దిగ్గజానికి రూ.250 కోట్లకు విక్రయించింది. తన ఆస్తుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ ఆస్తిని విక్రయించినట్లు పేర్కొంది. అలాగే, భూమి అమ్మకంలో ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించలేదు. అన్ని నియమాలను పాటించాం, ఈ భూమిని ప్రభుత్వం కేటాయించలేదని పేర్కొంది.
అభ్యంతరాలు?
కానీ ఈ వాదనను ప్రభుత్వం అంగీకరించలేదు. భూవిక్రయాలను ఆమోదించిన సర్జాపుర సబ్ రిజి స్ట్రార్ రవి సంకనగౌడను సస్పెండ్ చేసింది. అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా 40 సేల్ డీడ్‌లు పుట్టుకొచ్చాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ సాఫ్ట్‌వేర్ కావేరి 2.0లోని లోపాలను వాడుకున్నారని, కోర్టు ఆదేశం ఉన్నట్లయితే సేల్ డీడ్‌లు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు పొందే నిబంధన ఉంది. దీనిని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.
రెండు ప్రైవేటు సంస్థల ఒప్పందం
సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు


